మీరు మొదట iPhone ఆన్ చేసినప్పుడు కనిపించే హలో స్క్రీన్.

ప్రారంభించండి

మీరు మీ కొత్త iPhoneను ఉపయోగించడం ప్రారంభించే ముందు కొన్ని ప్రాథమిక ఫీచర్‌లను సెటప్ చేయండి.

ప్రాథమిక ఫీచర్లను సెటప్ చేయడం

iPhone హోమ్ స్క్రీన్. యాప్‌లు స్క్రీన్ దిగువన ఒకే రంగులో కనిపిస్తాయి, ఇంకా వాల్‌పేపర్ ఫోటోలో రంగును కలిపేస్తాయి.

వ్యక్తిగత శైలిలోకి మార్చడం

మీ iPhone మీ వ్యక్తిగత శైలి, ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తుంది. లాక్ స్క్రీన్‌లో మీకు ఇష్టమైన ఫోటోలను చూపించండి, హోమ్ స్క్రీన్‌కు విడ్జెట్‌లను జోడించండి, టెక్స్ట్ సైజ్, రింగ్‌టోన్‌లు ఇంకా మరిన్నింటిని అడ్జస్ట్ చేయండి.

మీ iPhoneను మీకు నచ్చినట్లుగా మార్చుకోండి

ఫోటో మోడ్‌లో ఉండి, కెమెరా ఫ్రేమ్‌లో నలుగురు వ్యక్తులను చూపుతున్న కెమెరా స్క్రీన్.

అద్భుతమైన ఫోటోను తీయడం

మీరు ఎక్కడ ఉన్నా ఆ క్షణాన్ని క్యాప్చర్ చేయడానికి మీ iPhoneను ఉపయోగించండి. చిటికెలో ఫోటోలు, వీడియోలను ఎలా తీయాలో అలాగే మీ iPhoneలో ఇతర కెమెరా ఫీచర్‌లను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

అద్భుతమైన ఫోటోలు, వీడియోలను తీయండి

FaceTime కాల్.

కనెక్ట్ అయి ఉండండి

iPhone మీకు ముఖ్యమైన వ్యక్తులను చేరుకోవడాన్ని సులభతరం చేస్తుంది. వారిని మీ కాంటాక్ట్‌లలో జోడించండి, అప్పుడు మీకు అవసరమైనప్పుడల్లా వారి సమాచారం మీకు అందుబాటులో ఉంటుంది, ఆపై టెక్స్ట్ సందేశాలు, ఫన్ కాల్స్ లేదా FaceTimeతో కనెక్ట్ అయి ఉండండి.

స్నేహితులు, కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉండండి

సెట్టింగ్స్‌లో ఫ్యామిలీ షేరింగ్ స్క్రీన్. జాబితా చేయబడిన ఐదుగురు కుటుంబ సభ్యులు. వారి పేర్లకు దిగువన కుటుంబ చెక్‌లిస్ట్, దాని దిగువన సబ్‌స్క్రిప్షన్‌లు, కొనుగోలు షేరింగ్ ఎంపికలు ఉన్నాయి.

కుటుంబంలోని అందరూ

అర్హత గల యాప్ కొనుగోళ్ళు, మీ లొకేషన్, ఆరోగ్య డేటాను కూడా షేర్ చేయడానికి మీరు ఇంకా మీ కుటుంబ సభ్యులు ఫ్యామిలీ షేరింగ్‌ను ఉపయోగించవచ్చు. మీరు మీ పాస్‌కోడ్‌ను మర్చిపోతే మీ iPhoneకు యాక్సెస్‌ను తిరిగి పొందడానికి మీ కుటుంబ సభ్యులను లేదా మీరు విశ్వసించే వేరే వ్యక్తిని కూడా ఎంచుకోవచ్చు.

మీ కుటుంబంతో ఫీచర్‌లను షేర్ చేయండి

హోమ్ యాప్‌లో ఉన్న నా హోమ్ స్క్రీన్.

మీ రోజును సులభతరం చేసుకోండి

మీరు తరచుగా వెళ్ళే ప్రదేశాలకు దిశా నిర్దేశం పొందడానికి, మీ మార్నింగ్ కాఫీ ఖర్చును చెల్లించడానికి, ముఖ్యమైన టాస్క్‌ల గురించి రిమైండర్ అందుకోవడానికి, అలాగే మీరు ఇంటి నుండి బయటికి వస్తున్నప్పుడు ఫ్రంట్ డోర్‌ను ఆటోమేటిక్‌గా లాక్ చేయడానికి కూడా మీ iPhone‌లోని యాప్‌లను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

మీ రోజువారీ పనుల కోసం iPhoneను ఉపయోగించండి

ఛార్జ్ చేసిన బ్యాటరీ 100% చూపుతున్న iPhone స్క్రీన్.

ప్రో టిప్స్

మీ iPhoneను, అలాగే అందులో మీరు ఉంచిన సమాచారాన్ని సురక్షితంగా, భద్రంగా ఉంచడానికి Apple మద్దతు సలహాదారుల నుండి ఈ టిప్స్‌ను తెలుసుకోండి.

Apple మద్దతు నుండి నిపుణుల సలహా

iPhone యూజర్ గైడ్‌ను అన్వేషించడానికి, పేజీకి ఎగువన ఉన్న ’విషయ సూచిక’ క్లిక్ చేయండి లేదా శోధన ఫీల్డ్‌లో పదం లేదా పదబంధాన్ని నమోదు చేయండి.

ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.